ఆకేరు న్యూస్, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. క్లాస్ మేట్ కు న్యూఇయర విషెస్ శుభాకాంక్షలు((New Year Wishes) చెప్పాడని విద్యార్థిపై ఆ అమ్మాయి కుటుంబసభ్యులు దాడి చేశారు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. సిరిసిల్లకు చెందిన శివకిశోర్ 10వ తరగతి చదువుతున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నిన్న తన క్లాస్మేట్(Classmate) అమ్మాయికి విషెస్ చెప్పాడు. అమ్మాయి కుటుంబ సభ్యులకు అది నచ్చలేదు. మా అమ్మాయికే విషెస్ చెప్తావా అని శివకిశోర్పై దాడి చేశారు. ఈదాడితో మనస్తాపానికి గురైన శివ కిశోర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
