* ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు
* ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజకీయ లబ్దికోసమే కొందరు నామీద కుట్రలు చేస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దయాకర్ రావు (Errabelli Dayakar Rao) తనను బెదిరించి బలవంతంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని శరణ్ చౌదరి అనే బీజేపీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ రవిగుప్తాకు దుబాయి నుంచి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం హైదరాబాద్ బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూ దందాలు, కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ నుంచి శరణ్ చౌదరి (Sharan chowdary )ని తొలగించారని దయాకర్ రావు అన్నారు. నకిలీ పత్రాలతో ఎన్ఆర్ ఐ ల నుంచి డబ్బులు తీసుకొని మోసగించినట్లు కూడా శరణ్ మీద ఆరోపణలు ఉన్నాయన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులున్నాయని అటువంటి వ్యక్తిని ప్రోత్సహించొద్దని ఎర్రబెల్లి సూచించారు. శరణ్ చౌదరి విజయ్ అనే విజయ్ అనే ఒక ఎన్ఆర్ఐ (NRI) వద్ద రూ, 5 కోట్లు తీసుకుని మోసం చేశాడని తన వద్దకు వచ్చారన్నారు. తాను పోలీస్ కమిషనర్ వద్దకు పంపినట్లు ఎర్రబెల్లి వెల్లడించారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపార్ట్మెంట్ అమ్మి కొంత డబ్బులు ఇచ్చేశాడట.. మిగిలిన డబ్బులు తిరిగి చెల్లించాలని విజయ్ ఒత్తిడి తేవడంతో ఇపుడు తన మీద ఆరోపణలు చేస్తున్నాడని దయాకర్ రావు అన్నారు. ఎన్ ఆర్ ఐ విజయ్ ( NRI Vijay ) కూడా నాకు పరిచయం లేడు. కొంత మంది నాకు తెలిసిన ఎన్ ఆర్ ఐ ల ద్వరా నా వద్దకు వచ్చాడు. నేను అప్పటి పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్ళమని చెప్పాను. శరణ్ మీద ఇప్పటికే పోలీస్ స్టేషన్లల్లో చాలా కేసులు ఉన్నాయని తెలిసింది. అలాంటి వ్యక్తులు నా లాంటి సీనియర్ రాజకీయ నాయకులపై ఆరోపణలు చేస్తే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే వార్తలు రాయాలని మీడియాను కోరారు.
* రాజకీయ లబ్దికోసమే కొందరు నామీద కుట్రలు చేస్తున్నారు.
విజయ్ అనే ఎన్ ఆర్ ఐ నాకు బంధువని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కాదని, అయన కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని తెలిసిందన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఎలాంటి మచ్చ లేదన్నారు. తనను అక్రమంగా ఇరికించేందుకు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశారన్నారు. ప్రజల కోసం తాను పోరాటాలు చేశాను తప్ప ఎక్కడా పొరపాట్లు చేయలేదన్నారు. విజయ్ అమెరికా నుంచి పంపిన వీడియో విలేకరుల సమావేశంలో చూపించారు. శరణ్ పేరుతో ఒక్క ఎకరం రిజిస్ట్రేషన్ లేకపోయినప్పటికీ తన పేరు మీద మూడు ఎకరాల భూమి ఉందని దొంగ డాక్యుమెంట్లతో మోసం చేశాడన్నారు. అడ్వాన్స్ పేరుతో రూ. 5 కోట్లు తీసుకున్నాడన్నారు. తనకు న్యాయం చేయమని మాత్రమే అపుడు మంత్రిగా ఉన్న దయాకర్ రావు ను కలిశామని విజయ్ స్పష్టం చేశారు.రాజకీయ లబ్దికోసమే కొందరు నామీద కుట్రలు చేస్తున్నారు.
* ఫోన్ ట్యాపింగ్ తో నా కెలాంటి సంబంధం లేదు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దుగ్యాల ప్రణీత్ రావు గురించి తనకు తెలియదు. ఆయన బంధువులు తన ఊరిలో ఉన్నారు. ప్రణీత్ రావు కుటుంబం ఏ పార్టీలో ఉందో… తనకు ఆయనతో సంబంధం ఉందో లేదో పూర్తి స్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు విచారణలో తనతో పరిచయం కూడా లేదని చెప్పినట్లు తెలిసిందన్నారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నాయన్నారు. కొన్ని రాజకీయ పార్టీల హైకమాండ్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారన్నది నిజమే. ఎంత ఒత్తిడి వచ్చినా నేను పార్టీ మారేది లేనేలేదు. గతంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా చాలా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. నేను వరుసగా గెలుస్తున్న వర్ధన్నపేటను రిజర్వ్డ్ కేటగిరిలోకి మార్చారు. నేను గెలిచిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ఎస్సీ రిజర్వేషన్ గా మార్చారన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో పాలకుర్తి నియోజకవర్గం వెళ్ళి మూడు సార్లు గెలిచానన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా తెలంగాణ కోసం కొట్లాడానని ఎర్రబెల్లి చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
———————–