* ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కోర్టు ఆదేశాలు
* ఇదీ పొలిటికల్ లాండరింగ్ కేసు
* అప్రూవర్‌గా మారేది లేదు
మీడియాతో కవిత వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (liuor Scam ) లో ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిసియల్ కస్టడి విధించింది. ఈడి కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ఈడి, (ED ) కవిత ( kavitha ) న్యాయవాదుల వాదనలు వినిపించారు. తన కుమారుడి పరీక్షల కోసం తాను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం కోర్టు 14 రోజులు అంటే ఏప్రిల్ 9 వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇందు కోసం తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెను పోలీసులు తీహార్ జైలు ( Tihar jail )కు తరలించారు. కోర్టులో హాజరుపరచిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇదీ మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్‌గా మారేది లేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళల్లో ఒకరు బీజేపీలో చేరారు. మరో నిందితుడికి ఏకంగా బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు 50 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చారని కవిత చెప్పింది. కావాలని నా మీద తప్పుడు కేసు పెట్టారు.తాత్కాళికంగా నన్ను జైల్లో పెట్టొచ్చు. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు.. నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. అంటూ కవిత మీడియాకు చెప్పింది. కాగా కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఎప్రిల్ 9న విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది.
———————-