* డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత(SP Kavitha)పై పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను డీజీపీ(Dgp) కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవిత స్థానంలో శ్రీనివాస్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఎస్పీ కవితపై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు, డీజిల్ అక్రమాలు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కవిత అక్రమాలపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో ఆమె అక్రమ వసూళ్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వాటిని నిర్ధారించుకున్న తర్వాత కవితపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా(Nalgonda District)కు 2017 సంవత్సరంలో డీఎస్పీ కేడర్ అధికారిగా పోస్టింగ్‌పై వచ్చిన గంజి కవిత ఏడేళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు పొందినా బదిలీపై వెళ్లకుండా తన పలుకుబడిని ఉపయోగించి ఇక్కడే కొనసాగుతున్నారు.
……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
