ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంథ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు మరికొంత ఊరట లభించింది. ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకరం పెట్టి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని నాంపల్లి కోర్టు (Nampalli Court)పేర్కొంది. విచారణ నుంచి మినహాయింపులు ఇచ్చింది. అదే సమయంలో అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా నాంపల్లి కోర్టు అనుమతి మంజూరు చేసింది. సంథ్య థియేటర్(Sandhya Theator) తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రాక వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ లభించింది. అయితే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా అందుకు తన హాజరుకు మినహాయించాలని అల్లుఅర్జున్ కోర్టును ఆశ్రయించగా, అందుకు కోర్టు సమ్మతించింది.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
