Published:
Updated: 16 Jan 2025 • 09:32 AM
* మహబూబాబాద్ జిల్లాలో దారుణం..
ఆకేరున్యూస్, మహబూబాబాద్ : మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. కలకాలం తోడుంటానని మనవాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను కిరాతకంగా హతమార్చి ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఈ విషాదకర సంఘటన మహబూబాద్లోని సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది. హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పాతిపెట్టిన చోట తవ్వడంతో వివాహిత మృతదేహం బయటపడగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
……………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
