Vijayasai Reddy New Party AP
* టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలు
* ఏపీలో కొత్త పార్టీ అవసరం ఉంది
* యువతకు 66 శాతం ప్రాధాన్యత
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలుగా మారిపోయాయని మాజీ ఎంపీ వీ. విజయసాయిరెడ్డి విమర్శించారు. ద్విపార్టీ వ్యవస్థ వల్ల ప్రజల సంక్షేమం దెబ్బతింటోందని, కేవలం రెండు కుటుంబాలు మాత్రమే రాష్ట్రాన్ని ఏలాలనే విధానం నడుస్తోందని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే కాకుండా అనేక ఇతర వర్గాలు ఉన్నాయని, అందరికీ ప్రాతినిధ్యం లభించాలనే ఉద్దేశంతోనే కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
* అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు
ఖర్చుల కంటే ఆదాయం తక్కువగా ఉండి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. తాము పెట్టబోయే కొత్త పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు ప్రధాన అంశాలను పొందుపరుస్తామని తెలిపారు. ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని ఎలా పెంచాలో స్పష్టమైన ప్రణాళికను వివరిస్తామని తెలిపారు.
* అందుకే రెండేళ్లుగా కనిపించలేదు
రెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో కనిపించకపోవడంపై వివరణ ఇచ్చారు. గత ఏడాది కాలంగా ప్రజా సమస్యలు, సామాజిక పరిణామాలపై లోతైన అధ్యయనం చేస్తూ ఒక పుస్తకాన్ని రచించానని తెలిపారు. కాపుల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఎలా ఉద్భవించింది? గ్రామీణ వ్యవస్థల్లో వారి పాత్ర ఎలా ఉండేది? అనే అంశాలపై 350 పేజీల పుస్తకాన్ని రూపొందించినట్లు చెప్పారు.
* బకాయిలపై స్పష్టత ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం అసలు బాకీ ఎంత అనేది స్పష్టంగా లెక్కించాలి. వైఎస్సార్సీపీ చెప్పినట్లు లేదా ఈ రోజు గణాంకాలు చెబుతున్నట్లుగా రాష్ట్ర అప్పు రూ. 12 లక్షల కోట్లకు చేరి ఉంటే… విభజన జరిగిన ఈ 12 సంవత్సరాలలో అంత భారీ మొత్తం ఖర్చు చేసి రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి ఏమిటని విజయసాయిరెడ్డి నిలదీశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
