* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి.. తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేయించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసుల్లో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.. రేవంత రెడ్డి సిద్ధమా..? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు పెట్టారు. విచారణ సంస్థలను, అధికారులను గౌరవించి ఈ నెల 9న ఏసీబీ విచారణకు.. 16న ఈడీ విచారణకు హాజరయ్యానన్నారు. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు ఏడు గంటల పాటు అడిగి అన్ని వివరాలు తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
