ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే భారత్ విచ్చేశారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మరోవైపు రేపు జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
