
* ఎన్కౌంటర్పై పోలీసుల ఫేక్ ప్రకటన
* సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి పేరిట లేఖ విడుదల
ఆకేరున్యూస్, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమాండర్ దామోదర్ అలియాస్ చోక్కారావు క్షేమంగా ఉన్నాడని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. చత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మృతిచెందినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరచింది. ఈ ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోలేదని ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్ తేర్ సమత పేరుతో లేఖ విడుదల చేశారు. పోలీసులు కావాలనే ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మరణించారని వారిలో నలుగురు మావోయిస్టులు కాగా మరో నలుగురు గ్రామస్తులు ఉన్నారని తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
…………………………………………….