* గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
* పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుక(Republicday Celebrations)లు ఉత్సాహపూరితంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Varma)జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanthreddy), మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు. సాంస్కృతిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అన్నారు. సాగుభూములకు రైతు భరోసా, రుణమాఫీ నిర్ణయాలు రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
