* ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
* రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు రిపబ్లిక్ డే పరేడ్
ఆకేరు న్యూస్, డెస్క్ : గణతంత్ర వేడుకలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి ముర్ము (President Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాం(Indonesia President Subiyam)తో హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi), పలువురు కేంద్రం మంత్రులు పాల్గొన్నారు. స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్.. ఇతివృత్తంతో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణలు, పినాక మల్టీ బ్యారేజ్ ర్యాకెట్ నిలిచాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్లు రిపబ్లిక్ డే పరేడ్ (Republicdady parade)నిర్వహించారు. పరేడ్ లో రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
