* రైల్వే డీఆర్ఎం బర్తేష్ కుమార్ జైన్, అడిషనల్ డీజీఎం గోపాలన్ ప్రంజన్ను కోరిన వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: బస్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని సికింద్రాబాద్‌లోని రైల్వే భవన్లో రైల్వే డీఆర్ఎం బర్తేష్ కుమార్ జైన్, అడిషనల్ డీజీఎం గోపాలన్ ప్రంజన్ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. ఇటీవలే కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో నూతన బస్ స్టేషన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే… ఈ సందర్భంగా రైల్వే అధికారుల నివేదికను పునః పరిశీలించి వీలైనంత త్వరగతిన బస్‌స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని కోరారు. అ సందర్భంగా సానుకూలంఆ స్పందించిన రౖౖెల్వే డీఆర్ఎం రైల్వే బోర్డ్‌కి ప్రతిపాదనలను పంపుతున్నామని తెలిపారు.

………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
