* బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని.. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని..కాంగ్రెస్ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు.
తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని.. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటు వేటేస్తే వచ్చే పథకాలు కూడా రాకుండా అయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని.. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని.. రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
