* కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
* ఎక్స్ వేదికగా విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ (Kcr) దేశానికే అన్నపూర్ణగా మార్చితే, ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేశారని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారని ఎక్స్(X) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారని, ఏడాది రేవంత్ (Revanth) పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని విమర్శించారు. జాగో తెలంగాణ (Jago Telangana) జాగో.. అని పిలుపునిచ్చారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
