Jana Telangana Party
* తెలంగాణ లో సరికొత్త రాజకీయ పార్టీ
* మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు అనంతరం కీలక పరిణామం
* ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తం
* ఇప్పటికే క్షేత్ర స్తాయి సమావేశాలు పూర్తి
ఆకేరు న్యూస్ – ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ యవనికపై మరో రాజకీయ పార్టీ అడుగుపెడుతోంది. మాజీ మావోయిస్ట్‌ల సారథ్యంలో ఈ రాజకీయ పార్టీ అవతరించబోతోంది. ఇందుకోసం అవసరమైన క్షేత్ర స్థాయి సమావేశాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. సీపీఐ మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం లొంగుబాటు అనంతరం జరిగే ఈ పరిణామం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది. మాజీ మావోయిస్ట్ ల సారథ్యంలో అనగానే పాలక వర్గాలు, ప్రజల్లో సరికొత్త సందేహాలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయి.. ఇందుకోసం భారత రాజ్యంగ స్పూర్తి వెలుగులో ఎన్నికల బరిలో దిగేందుకు ఈ రాజకీయ పార్టీ సిద్దంగా ఉందని ప్రకటిస్తోంది.. జన తెలంగాణ పార్టీ పేరుతో పాటు ఇతర పేర్లను పరిశీలిస్తున్నారు..
* ఎవరి సారథ్యం.. ?
సీపీఐ మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు లంకా పాపిరెడ్డి. తొలితరం పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వంలో ఉన్న హుజురాబాద్ కు చెందిన సదానందం, పోరెడ్డి వెంకట్ రెడ్డి , విద్యావంతుల వేదిక నేత గురిజాల రవిందర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్ట్ నేత అజయ్ బాల్నే , హైకోర్టు న్యాయవాది బల్లా రవీంద్ర నాథ్ తదితరుల నాయకత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటున్నది.. పార్టీ విదానాలకు సంబందించిన ముసాయిదా ను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కి ఈ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని లంకా పాపిరెడ్డి స్పష్టం చేశారు..
——————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
