* సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా రాష్ట్రపతి భవన్ పెళ్లి వేదిక కాబోతోంది. ఈ పెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో జరుగబోతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్లో జరగనుంది. అందుకు ఈనెల 12న ముహూర్తం కుదిరింది. ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పూనమ్ గుప్తాకు జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న అవ్నీష్ కుమార్‌తో వివాహం ఖరారైంది. ఫిబ్రవరి 12న వీరి వివాహం జరగనుంది. పెళ్లి ఆహ్వానం అందించే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకోవాలని సూచించారట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వివాహాన్ని రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ అరుదైన అవకాశాన్ని పూనమ్ గుప్తా, అవ్నీష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. దీనితో దేశ చరిత్రలో మొదటి సారి రాష్ట్రపతి భవన్లో మోగనున్న పెళ్లి భాజా మోగనుంది.పూనమ్ గుప్తా ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ హోదాలో పని చేస్తున్నారు. తన విధుల్లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేస్తున్న పూనమ్ గుప్తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలుమార్లు ప్రశంసించారు. గణతంత్ర దినోత్సవంలో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి సారథ్యం వహించిన పూనమ్ గుప్తా రాష్ట్రపతి దృష్టిలో మరింత మంచి స్థానం సంపాదించారు. పూనమ్ గుప్తా విద్య, కెరీర్ ప్రయాణం చూస్తే.. ఆమె చిన్నతనం నుంచే ధైర్యవంతురాలు. నవోదయ విద్యాలయంలో చదివిన పూనమ్ గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్వాలియర్‌లోని శివాజీ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేశారు. 2018లో యూపీఎస్సీ సీఏపీఎఫ్ పరీక్షల్లో 81వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమాండెంట్‌గా చేరారు. మొత్తానికి రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకునే అరుదైన అవకాశం ఇప్పటి వరకు ఎవరికి కలగలేదు. ఇది పూనమ్ గుప్తా సేవల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్న కృతజ్ఞతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ వివాహం రాష్ట్రపతి భవన్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
