* ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ అయ్యే సమయానికి గేర్ లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిని పైలెట్ కోరారు. అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సేఫ్ గా కార్గో ఫ్లైట్ (Cargo Flight) ల్యాండింగ్ చేయించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. దీంతో కార్గో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో విమానం లో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి వేగంగా చర్యలు తీసుకోవడం వల్లనే విమానం సేఫ్ గా ల్యాండ్ అయిందని చెబుతున్నారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
