Nashkal Canal Land Acquisition
ఆకేరు న్యూస్,రాయపర్తి:
మండలంలోని కొలన్ పల్లి, కేశవాపూర్, మరియు బురాన్ పల్లి గ్రామాలలో నష్కల్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ భూసేకరణకు సంబంధించి ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు సేకరించడం మరియు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) టి. సుమ, మండల తహసిల్దార్ ఎం. శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ త్రీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని, రైతులకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
ఈ గ్రామసభలలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు కోలన్ పల్లి సర్పంచ్ వంగాల ఎల్లమ్మ,బురాన్ పల్లి సర్పంచ్ ఉమాదేవి, కేశవాపూర్ సర్పంచ్ గు గుజ సుధాకర్ తో పాటు స్థానిక గిర్ధవార్ (RI), జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
