SVBC Chairman Sridhara Varma
* ప్రమాణ స్వీకారానికి హాజరయిన నందమూరి కుటుంబ సభ్యులు
ఆకేరు న్యూస్, అమరావతి :
తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) నూతన ఛైర్మన్గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీబీసీ ఛైర్మన్గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి రామకృష్ణ , నందమూరి మోహన రూపా, కామినేని సీమంతిని , దగ్గుబాటి నివేదిత , ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ భరత భూషణ్ , తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ… “నా సోదర సమానుడు శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు రాజు గారి పిల్లలు కూడా అంతేనన్నారు. నాడు రామారావు తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్న కోరికను కాదనకుండా టిటిడి కోసం పనిచేశారన్నారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి తరం నుండి ఆ కుటుంబం మాకు అండగా ఉందన్నారు. అటువంటి రాజుగారి కుమారుడు నేడు తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ టిటిడి ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రాజుగా ప్రసిద్ధి చెందిన రాజుగారి కుమారుడు శ్రీధర్ వర్మ నేడు ఎస్విబిసి చైర్మన్ గా నియమించబడటం మా కుటుంబ సభ్యులకు ఆనందకరం. ఆయన దానికి అర్హుడు. గత నాలుగు తరాలుగా ఆ కుటుంబం స్వామివారి సేవలో ఉన్నారు. ఎన్టీఆర్ రాజు చాలా నమ్మకంగా ఉండేవారు, అటువంటి మహానుభావుడు కొడుకు శ్రీధర్ వర్మ ఆయన బాటలో నడుస్తూ ఎస్వీబీసీ ఛానల్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని కోరుకుంటున్నానని అన్నారు.
నందమూరి మోహన రూప మాట్లాడుతూ… “నేడు నందమూరి కుటుంబమంతా చాలా ఆనందించే రోజు. మా పెదనాన్న ఎన్టీఆర్ రాజు కి గొప్ప గౌరవం దక్కింది. రాజు గారు రామారావు గారి అభిమానిగా ఉంటూ నిస్వార్ధంగా ఆయన కోసం పనిచేశారు. విలువలతో కూడిన వ్యక్తి , చివరి వరకు అలాగే ఉన్నారు. అటువంటి అరుదైన వ్యక్తికి కుమారుడు మా అన్నయ్య శ్రీధర్ వర్మ నేడు ఎస్విబిసి చైర్మన్ గా ఎంపిక కావడం చాలా సంతోషకరం. ఆ పదవికి అయిన పూర్తిగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఆయనకు ఇటువంటి గౌరవం ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానని అన్నారు..
———————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
