Husband Dies After Wife
* మనోవేదనతో భర్త మృతి
* పర్వతగిరి మండలంలో విషాదం
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట : ఆ ఇద్దరు తోడు నీడై జీవన ప్రయాణం సాగించారు.. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలిచారు.. ప్రేమాను రాగాలకు మారు పేరుగా నిలిచారు ఆ దంపతులు.. కాలం వారిపై కన్నెర్ర జేసింది.. భార్య కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురయింది.. అన్నీ తానై భర్త కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.. అయినా ఫలితం దక్కలేదు.. తట్టుకోలేక పోయాడు.. మృత్యువులోనూ ఒకే దారిగా వెళ్ళి పోయారు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామానికి చెందిన గిద్దమారి భారతమ్మ శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడించింది.
. భార్య మృతి చెందిన 24 గంటలు గడవకముందే భర్త కూడా మృతిచెందడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది.భర్త గిద్దమారి బిక్షపతి ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయాడు.. 24 గంటలకు గడవక ముందే మనో వేదనతో కన్నుమూశాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన ఈ దంపతులు మరణంలోనూ ఒకరిని మరొకరు వీడలేదని గ్రామస్తులు భావోద్వేగంతో నివాళులర్పించారు.
——————————–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
