* ఆస్తి రిజిస్ట్రేషన్‌కు రూ. 10వేలు డిమాండ్
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ( Registration Office ) అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులు (ACB Raids ) నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కవితా కాంప్లెక్స్ రెండో అంస్తులో జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. సోమవారం ఉదయం ఈ కార్యాలయంపై అవినీతి శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆస్తి జిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
