అమ్మ, తాతయ్య ,నానమ్మలు తాను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నారని ఆనందంగా చెబుతున్న పైలట్ ప్రదీప్ కృష్ణన్
పైలట్ ప్రకటన … తల్లి కంట తడి.

ఆకేరు న్యూస్ : ఆ విమానంలో ఆత్మీయ దృశ్యం ఆవిష్కరించబడింది. కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లీ ఆనందంతో హృదయం బరువెక్కింది. పైలట్ కు కూడా అదీ అరుదైన క్షణాలే.. ఇంతకు ఏం జరిగిందంటే.. చెన్నై నుంచి కోయంబత్తూర్ ( Chennai -Coimbatore )కు వెళ్తున్న విమానంలో తాను పైలట్ గా ఉన్న ప్లైట్ లో తన కుటుంబ సభ్యులు ప్రయాణించడం సంతోషంగా ఉందని టేకాఫ్ కు ముందు తమిళం, ఇంగ్లీష్ మిక్స్ లో స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసి స్వాగతించాడు.
ఈ రోజు నాతో పాటు నా తల్లి, తాత మరియు నానమ్మ ఇదే విమానంలో ప్రయాణిస్తున్నారు, 29వ వరుసలో కూర్చున్నారని, తాతయ్య విమానంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి అని చెప్పాడు పైలట్ ప్రదీప్ కృష్ణన్ ( Pilot Pradeep Krishnan ) . తాతయ్య తనను చిన్నప్పుడు తన స్కూటర్ మీద కూర్చుండ పెట్టుకుని తిప్పే వాడన్నారు. ఇపుడు తాను తాతయ్యను నేను నడుపుతున్న విమానంలో కూర్చో బెట్టుకోవడం ఎంతో సంతోషాన్నించిందన్నారు. పైలట్ కృష్ణన్ ప్రకటనతో అతని తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అతని తాత తన సీట్ నుండి లేచి ఇతర ప్రయాణికులకు అభివాదం చేశాడు. వారు అతని కోసం సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు.. ఈ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
