* ఓ ఎమ్మెల్యే అరుదైన రికార్డు
ఆకేరు న్యూస్, అమరావతి : 105 చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotomreddy Sridharreddy) ఒకేరోజు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు. 300 పనులను 60రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు రచించినట్లు కోటంరెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. 303 అభివృద్ధి పనులను అరవై రోజుల్లో పూర్తి చేసి.. కూటమి కార్యకర్తలతో ప్రారంభిస్తామని కోటంరెడ్డి వివరించారు. రూరల్లో 191 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు (Chandrababu)అందించే సంక్షేమ పథకాలతో పాటు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదో అరుదైన ఘట్టం
ఎమ్మెల్యే కోటంరెడ్డికి మంత్రి లోకేశ్ (minister Lokesh) అభినందనలు తెలిపారు. ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు.. శ్రీకారం చుట్టి కోటంరెడ్డి రికార్డు సృష్టించారని అన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదో అరుదైన ఘట్టమన్నారు. ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచిన కోటంరెడ్డికి అభినందనలన్నారు.
……………………………………………..
