Drug Free Society Goal
ఆకేరు న్యూస్, తొర్రూరు: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డిఎస్పి కృష్ణ కిషోర్ అన్నారు తొర్రుర్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొర్రూర్ ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి కృష్ణ కిషోర్ పాల్గొని మాట్లాడుతూ.. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పని చేస్తున్నామని,యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అలవాటు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక జీవితాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రైతులు చట్టబద్ధమైన పంటల సాగుపై దృష్టి సారించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గంజాయి పై సమాచారం ఇచ్చిన వారికి 5000 పారితోషికం ఇవ్వబడుతుందని అలాగే వారి సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు.
