
* తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
* అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్ జిల్లా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చైతన్యం కలిగిన ప్రాంతమన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ (Warangal)గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయ శంకర్ సర్.. లాంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండి పోయే మహనీయులు అని తెలిపారు. గత సీఎం కేసీఆర్ మా నెత్తిపై 8.29 లక్షల అప్పును పెట్టారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సి ఉందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు (Free Bus Journey) ప్రయాణం కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఇప్పటికే రూ.5,500 కోట్లు కేటాయించామన్నారు. ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొడితే తాము వచ్చాక రైతుల ఖాతాల్లో 7,200 కోట్లు వేశామన్నారు. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను సవ్యంగా నిర్వహించి ఉద్యాగాలు కల్పిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే కృషి చేస్తున్నట్లు వివరించారు.
…………………………………