
* ఏ టైమ్ అయినా.. ఏ ప్రాజెక్టు దగ్గరకైనా
* వరంగల్ గడ్డపై సీఎం రేవంత్ సవాల్
* రూ.58 లక్షల జీతం తీసుకునేది ఫాంహౌస్‌లో పడుకోవడానికా?
* దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి బజారులో నిలబెడతానని వెల్లడి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : ప్రాజెక్టులపై కేసీఆర్, హరీశ్‌రావు దమ్ముంటే చర్చకు రావాలని సీఎం రేవంత్ (Cm Revanth) సవాల్ విసిరారు. ఏ టైమ్ అయినా, ఏ ప్రాజెక్టు వద్దయినా చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. ఆర్థిక పరిస్థితి అబద్దాలతో ఉండకూడదన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. కేసీఆర్(Kcr), హరీశ్‌రావు(Harishrao) వస్తే తేల్చుకుందామన్నారు. మా ప్రాజెక్టులే తెలంగాణను సస్య శ్యామలం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే వరంగల్ కు అన్నీ వచ్చాయని వివరించారు. పిల్లకాకులకు ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నారు. అది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అని విమర్శించారు. రూ. లక్ష కోట్లు కాళేశ్వరం నిర్మించారని, కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం(Kaleswaram) కూలిపోయిందన్నారు. కేసీఆర్ కు రూ. 58 లక్షల జీతం, అంత మంది పహారా ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగానికి రాకుండా జీతభత్యాలు తీసుకునే వెసులుబాటు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. నిత్యం జీతం తీసుకునేది ఫామ్ హౌస్(FarmHouse)లో కూర్చోవడానికేనా కేసీఆర్ అన్నారు. మీ అనుభవం, విజ్ఞానం తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా కేసీఆర్ అన్నారు. మీరు, మీ కొడుకు, మీ అల్లుడు అంతా ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని హరీశ్‌రావు అంటారని, జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ అన్నారు. లక్షల కోట్లు సంపాదించేటోడు జాతిపిత ఎట్ల అయితాడని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్ల అవుతాడని ప్రశ్నిస్తున్నానన్నారు. దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి బజారులో నిలబెడతా అన్నారు.
………………………………………