
* 15 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా స్టేషన్ ఘన్ పూర్ : కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. శివునిపల్లిలో జరిగిన ప్రజాపాలన సభలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోని మహిళా స్టాళ్లను పరిశీలించారు. ఒకేసారి నియోజకవర్గంలో రూ. 800 కోట్ల విలువైన ప్రగతి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. స్టేషన్ ఘన్పూర్ లో 5 సబ్ స్టేషన్లు, ఒక డివిజన్ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 5వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు, బ్యాంకుల లింకేజీ రుణ సౌకర్యాలను ప్రారంభించారు. ఎంపీ కడియం కావ్య(Mp Kadium Kavya), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. 15 ఏళ్లుగా స్టేషన్ ఘన్ పూర్ లో అభివృద్ధి లేదని కడియం శ్రీహరి (Kadium Srihari) తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో టీ20 ఆడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో సీఎం చెడుగుడు అడుతున్నారని తెలిపారు. బీఆర్ ఎస్ పాలకులు లక్ష కోట్లు దోచుకున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆలస్యమైనా హామీలు అన్నింటినీ నెరవేరుస్తున్నామన్నారు.
…………………………………