
ఆకేరున్యూస్, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం గిర్నిబావి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15న కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా సెంటర్లో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆయుధాలను లోడ్ చేస్తూ వాటర్ కెనాన్ ప్రదర్శిస్తూ భక్తులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ ప్రయోగించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ సీపీ సంప్రీత్ సింగ్ను కోరారు.
………………………….