* పిటిషనర్ కు రూ. కోటి జరిమానా
* కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పునిచ్చారు. హైకోర్టు(Highcourt)ను తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు రూ. కోటి జరిమానా విధించారు. ప్రభుత్వభూముల కబ్జాలను అడ్డుకున్న హైకోర్టు. హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్ విషయాన్ని దాచిపెట్టి, మరో కోర్టుకు పిటిషనర్లు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ (Justice Nagesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ పెండింగ్ లో ఉండగా, మరో బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ కోర్టులో ఉత్తర్వులు పొందాలన్న కుట్రలను హైకోర్టు అడ్డుకుంది. కోర్టును మోసగించాలని చూసిన పిటిషనర్ కు కోటి రూపాయల జరిమానా విధించింది. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
