బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్
* బాధ్యత మాత్రం మాది కాదు..
– బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల తీరు వల్లే త్వరలో ప్రభుత్వం పడిపోవచ్చని, అలా జరిగితే బాధ్యత మాది కాదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను రేవంత్‌కు మద్దతుగా నిలబడితే.. పార్టీలోని కొందరికి నచ్చడం లేదని వీహెచ్ అనడం వెనుక అర్థం ఏంటని ప్రశ్నించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చిందని, వాటిని నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఆందోళన మొదలైందని, జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటూ రాదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
—————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
