డాక్టర్ తాటికొండ రాజయ్య.
అధికారికంగా ప్రకటించిన కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ( BRS MP Candidate )గా తాటికొండ రాజయ్య ( Dr Rajaiah ) పేరును అధినేత కేసీఆర్ ( KCR ) ప్రకటించారు. కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు అందడంతో ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. కడియం కావ్య ఎన్నికల్లో పోటికి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజయ్యకు కలిసి వచ్చింది. కేసీఆర్ పిలుపు నేపథ్యంలో స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపి రాజయ్య కేసీఆర్ వద్దకు బయలుదేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అయితే వేరే ఏ పార్టీలోనూ చేరకపోవడంతో వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఆయనను పోటీచేయిందుకు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మంతనాలు సాగించారు. రాజయ్య కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు. భేటీ అనంతరం రాజయ్య అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించారు.
——————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
