* కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ శాంతికుమారి
ఆకేరున్యూస్, హైదరాబాద్: సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సవిూక్షించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల దుకాణాలకు వచ్చాయని, మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
