ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీవర్షం గంటపాటు దంచికొట్టింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షాకాలం మాదిరిగా రోడ్లు చెరువులు అయ్యాయి. భారీగా వర్షం (HEAVY RAINS) నీరు నిలిచిపోయింది. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్(Begumbazar), కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. పలుచోట్ల చెట్లు కూలాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బేగంపేట, ఖైరతాబాద్(Khairathabad), పంజాగుట్ట ప్రధాన మార్గల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాత తెలిపింది.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
