ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్తగా పట్టభద్రులు, టీచర్స్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వారిలో కొందరితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ((Legislative Council Chairman Gutta Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించాలి. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి (Telangana Legislative Council) వేదికగా ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy), శంకర్ నాయక్ (Shankar Nayak), నెల్లికంటి సత్యం (Nellikanti Satyam), మల్కా కొమురయ్య (Malka Komuraiah), అంజి రెడ్డి (Anji Reddy) తదితరులు ప్రమాణం చేశారు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా దాసోజు శ్రవణ్ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
