* దేవినేని ఉమ తనయుడి వివాహానికి హాజరు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపువిజయవాడ వెళ్లనున్నారు.. బెజవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరు కాబోతున్నారు. విజయవాడ పర్యటన కోసం ఉదయం 9.15 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు..ఉదయం 10.50 గంటల నుండి 11.30 గంటల వరకు దేవినేని ఉమా కుమారుడు వివాహానికి హాజరై.. వధూవరులను ఆశీర్వదించనున్నారు.. విజయవాడ నుంచి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. కాగా, గత వారం హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన కుమారుడు వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందించి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మిత్రుడి ఆహ్వానం మేరకు దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు.
………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
