Telangana RTC
* గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. సెప్టెంబర్ 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 21న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంఘాల నుంచి సమ్మతి తీసుకోనున్నారు. సెప్టెంబర్ 22న యూనియన్లకు ఓటర్ల జాబితాను అందజేయడంతో పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 24 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 25న సంఘాలకు తుది ఓటర్ల జాబితాను అందజేస్తారు. సెప్టెంబర్ 26న యూనియన్లకు ఎన్నికల గుర్తులను కేటాయించడంతో పాటు తుది ఓటర్ల జాబితాను రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. సెప్టెంబర్ 29న యూనియన్లకు నమూనా బ్యాలెట్ పత్రాలను అందజేయనున్నారు.
* ఎన్నికల షెడ్యూల్ ఇలా..
సెప్టెంబర్ 18 : ఎన్నికల షెడ్యూల్ విడుదల
సెప్టెంబర్ 21 : పోటీకి సంఘాల సమ్మతి
సెప్టెంబర్ 22 : ఓటర్ల జాబితా అందజేత, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం
సెప్టెంబర్ 24 : ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు చివరి తేదీ
సెప్టెంబర్ 25 : తుది ఓటర్ల జాబితా అందజేత
సెప్టెంబర్ 26 : ఎన్నికల గుర్తుల కేటాయింపు, తుది జాబితా రిటర్నింగ్ అధికారికి అప్పగింత
సెప్టెంబర్ 29 : నమూనా బ్యాలెట్ పత్రాల సమర్పణ
అక్టోబర్ 9 : ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
అక్టోబర్ 14, 15 : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్
అక్టోబర్ 17 : ఎన్నికల ఫలితాల వెల్లడి
ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కార్మిక సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్దీ ప్రచారం, కార్మికులను ఆకట్టుకునే హామీలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
