ఆకేరున్యూస్: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, హోంమంత్రి అమిత్‌షాతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెహల్గామ్ దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనుండగా.. ఉగ్రదాడి ఘటన తర్వాత సీసీఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. ఈ రోజు జరిగే భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
