* దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం
* జాతీయ భద్రత సలహా బోర్డు పునరుద్ధరణ
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ (Union Cabinet) సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి గణన సమయంలో కులగణన చేయాలని భావిస్తోంది. జనాభా లెక్కల సమయంలోనే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీ(New Delhi)లో జాతీయ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్), రాజకీయ వ్యవహారాల కమిటీ(సీసీపీఏ), కేంద్ర కేబినెట్ సమావేశం కూడా వరుసగా కొనసాగాయి. ఈ సమావేశాల అనంతరం కేంద్రం జాతీయ భద్రత సలహా బోర్డు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా మాజీ మిలిటరీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను నియమించారు. పాక్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహా బోర్డు చైర్మన్(ఎన్ ఎస్ఏ) గా రా(రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. మరిన్ని నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశంలో వెల్లడించారు.
………………………………………
