Telangana Heavy Rain Alert
Published:
ఆకేరు న్యూస్, వరంగల్:
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, వ్యాపారులు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం ‘వరుణ యాగం’ నిర్వహించారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో, మార్కెట్ కమిటీ మరియు అధికారుల సహకారంతో రుష్య శృంగారాధన సహిత ఘటాభిషేక పూర్వక వరుణ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యాపారులు, మార్కెట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
