Dharmasagar Reservoir Water Release by MLA kadiyam srihari and KR Nagaraj
* ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల..
ఆకేరు న్యూస్, హనుమకొండ: ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ ద్వారా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువ గేట్లను ఎత్తారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ నీటి విడుదల ద్వారా హసన్పర్తి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల పరిధిలోని వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు
