Bhogapuram International Airport Inauguration
అకేరు న్యూస్ అమరావతి : ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకోనున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలుకనున్నారు.
అనంతరం ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుని 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనను వీక్షిస్తారు. తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి, సభా వేదికకు చేరుకుంటారు.
ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.
