* దిగుమతులపై నిషేధం
ఆకేరు న్యూస్, డెస్క్ : పహల్గామ్ దాడి తర్వాత మోదీ సర్కారు (MODI GOVERNMENT) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం అన్ని రకాల ఉత్పత్తులకూ వర్తిస్తుందని పేర్కొంది. దిగుమతులతో పాటు గూడ్స్ ట్రాన్సిట్ పై కూడా నిషేధం విధించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పాక్ (PAK) చర్యలకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన విమానాలకు భారత గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత విమానాలకు గగనతలాన్ని పాకిస్థాన్ మూసివేసిన ఆరు రోజుల తర్వాత ఈ చర్య చేపట్టింది. భారత్, పాక్‌లు పరస్పరం విమానాలను తమ గగనతలాల్లోకి అనుమతించకుండా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు మే 23 అర్ధరాత్రి (మే 24, ఉదయం 5:29) వరకు అమల్లో ఉంటాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దాడి వెనుక పాకిస్థాన్ (PAKISTHAN) హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఉగ్రదాదిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి నాలుగు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేయడం మరింత బలం చేకూరింది.
…………………………………………….
