* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
* ఆధ్మాత్మిక క్షేత్రాలతో జాతీయ రహదారుల అనుసంధానం
* కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
* రూ.3,900 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (NITIN GADKHARY)అన్నారు. ముఖ్యంగా 4 అంశాలు దేశ భవిష్యత్ ను నిర్దేశిస్తాయని తెలిపారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కేంద్రం కీలకమైన ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు. రోడ్ల కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జోజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను చేపట్టామన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. నాగపూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణ – మహారాష్ట్ర (TELANGANA-MAHARASTRA) మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని వివరించారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. జగిత్యాల-కరీంనగర్ (JAGITYALA-KARIMNAGAR) హైవే విస్తరణ పనులను కూడా త్వరలో చేపడతామన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎన్నోప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. అంబర్పేటలో నిర్మించిన పై వంతెనను ఈరోజు ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా కాలుష్యం, సీఎన్ జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రూ.3,900 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం కాగజ్నగర్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. సభా వేదికపై నుంచి 7 జాతీయ రహదారులను ప్రారంభించారు. ఆదిలాబాద్ (ADILABAD)జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, ఎంపీలు నగేశ్ వంశీ, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, వెడ్మా బొజ్జు పాల్గొన్నారు.
………………………………………………..
