Hyderabad Drug Peddler Arrest
* హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ బీభత్సం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో నార్కోటిక్ నిరోధక చర్యల వేళ తీవ్ర కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడులకు వెళ్లిన పోలీసు బృందంపైకి ఓ నిందితుడు వేగంగా కారును దూసుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం అబిడ్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారు వెళ్లడంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ దాడిని అడ్డుకునే క్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
సంఘటన అనంతరం పరారవుతున్న నిందితుడిని పోలీసులు వెంటనే వెంటాడి, అఫ్జల్‌గంజ్ వద్ద చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడిని హుస్సేనీ ఆలామ్కు చెందిన సైఫ్‌గా గుర్తించారు. విధుల్లో ఉన్న పోలీసులపై ప్రాణాంతక దాడికి పాల్పడినందుకు గానూ నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ‘హత్యాయత్నం’ (Attempt to Murder) కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
