Old City | పాతబస్తీలో నిరసనలు.. అరెస్టులు..
* అక్కడా కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా
* తెల్లవారుజామునే అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ కబ్జాలో ఉన్న నిర్మాణాలనుఎ హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా పాతబస్తీపై కూడా దృష్టి సారించింది. గురువారం తెల్లవారుజామున చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని అక్బర్ నగర్లో భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. బండ్లగూడ మండలం పరిధిలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకు ఉన్న సుమారు 2000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా బృందం కూల్చివేసింది. ఈ చర్యతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.
———————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
