DAMODARA | వరంగల్ లో రీజినల్ క్యాన్సర్ సెంటర్
* రూ. 130 కోట్లతో ఖమ్మంలో మెడికల్ కళాశాల
* మంత్రి దామోదర రాజనర్సింహ
ఆకేరు న్యూస్,ఖమ్మం : రూ.35 కోట్లతో వరంగల్లో రీజినల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఖమ్మంలో ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖమ్మంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డిలలో కూడా రీజినల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ఆ తర్వాత మిగిలిన జిల్లా కేంద్రాల్లోనూ వీటిని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు రాజనర్సింహ తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల Government Medical College) భవన నిర్మాణానికి గురువారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarasimha), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister Tummala Nageswara Rao), రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Revenue Minister Ponguleti Srinivasa Reddy) శంకుస్థాపన ( Foundation) చేశారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా వైద్య రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాగపూర్, అమరావతి నేషనల్ హైవే పక్కన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందన్నారు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
