ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత పరిణామాలపై ప్రధానితో ఆయన చర్చించారు. అలాగే సరిహద్దు భద్రత, ఎల్ ఓసీ వద్ద తాజా పరిస్థితులపై సమాలోచనలు చేశారు. మరోవైపు, నియంత్రణ రేఖ వద్ద పాక్ (Pak) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడంతో భారత్ సైన్యం దీటుఆ బదులిస్తోంది. పంజాబ్లోని సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో దయాది దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్ ప్రకంటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీచేశారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
