* ముగ్గురు పోలీసులు మృతి?
ఆకేరు న్యూస్, ములుగు : తెలంగాణలో మందుపాతర కలకలం సృష్టించింది. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు సమాచారం. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. 17 రోజులుగా బలగాల ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ పేరుతో.. 90 కిలోమీటర్ల విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
