* వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆకేరున్యూస్, వరంగల్: ఎరువుల విక్రయాలను ఈపాస్ మెషిన్ల ద్వారానే చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. వరంగల్ శివనగర్‌లోని సాయి కన్వెన్షన్‌లో శుక్రవారం వరంగల్ జిల్లాలోని రిటైల్ ఎరువుల వ్యాపారులకు కొత్త ఈపాస్ మెషిన్ల కంపెనీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిధిగా పాల్గొని డీలర్లకు ఈపాస్ మెషిన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు అందరూ తప్పనిసరిగా ఎరువుల విక్రయాలను ఈపాస్ మెషిన్ ద్వారా మాత్రమే చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పాస్ మిషన్ల స్థానంలో కొత్త ఈపాస్ మెషిన్లను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల శాఖ వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు 171 ఈ పాస్ మెషిన్లను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారు డీలర్లకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది తెలిపారు. రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా సాగేందుకు, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆధునిక సాంకేతికత వినియోగం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ‘‘ఈ-పాస్ మెషిన్లతో ఎరువుల పంపిణీ మరింత సమర్థవంతంగా సాగుతుందని. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో, సరైన రేట్లకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. డీలర్లు నిబంధనల ప్రకారం మెషిన్లను ఉపయోగించి సరఫరా జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, వ్యవసాయ సహాయ సంచాలకులు కే దామోదర్ రెడ్డి , జి.నర్సింగం, వ్యవసాయ అధికారి రవీందర్, టెక్నికల్ ఏవో కృష్ణారెడ్డి , కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ జోనల్ మేనేజర్ సుజన్ కుమార్ , సుమన్ రెడ్డి , కోరమండల్ కంపెనీ సిబ్బంది మరియు వరంగల్ జిల్లాలోని ఎరువుల రిటైల్ డీలర్లు పాల్గొన్నారు.
……………………………..
